క్రికెట్: శ్రీలంక టూర్..కెప్టెన్ గా శిఖర్ ధావన్.. యువ ఆటగాళ్ళకు అవకాశం.

శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు జులైలో లంకకి బయలు దేరనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కి టీమిండియా ముఖ్య ఆటగాళ్ళు హాజరు కావడం లేదు. ఆగస్టు నెలలో ఇంగ్లండ్ లో జరగనున్న సిరీస్ కోసం వారందరూ ఇంగ్లండ్ పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే సిరీస్ లో యువ ఆటగాళ్ళకు అవకాశం లభించనుంది. ఐపీఎల్ లో సత్తా చాటిన దేవ్ దత్ పడిక్కల్, నితేష్ రానా, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యారు.

ఇక ఈ జట్టుకి కెప్టెన్ గా శిఖర్ ధావన్ ని సెలెక్ట్ చేసారు. వైస్ కెప్టెన్ గా డెత్ ఓవర్ స్పెషలిస్టు భువనేశ్వర కుమార్ కి అవకాశం వచ్చింది. జులై 13వ తేదీన మొదలవనున్న ఈ పర్యటనలో టీమిండియా, మూడు వన్డేలు, 3ట్వంటీ ట్వంటీ మ్యాచులు ఆడనుంది. జులై 13, 16, 18తేదీల్లో వన్డేలు జరుగుతుండగా, 21, 23, 25తేదీల్లో టీ ట్వంటీలు జరగనున్నాయి. మరి ఈ యువ ఆటగాళ్ళ జట్టు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.