SRH vs LSG: లక్నో డగౌట్‌పై నట్లు విసిరిన ఫ్యాన్స్.. గవాస్కర్ సీరియస్

-

ఐపీఎల్ 16వ సీజన్​ లో భాగంగా శనివారం రోజున హైదరాబాద్​లోని ఉప్పల్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ప్రేక్షకుల అనుచిత ప్రవర్తనతో మ్యాచ్‌కు 6 నిమిషాల అంతరాయం కలిగింది. లాంగాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ప్రేరక్‌ మన్కడ్‌ తన తలకు ఏదో బలంగా తాకిందంటూ తమ డగౌట్‌కు సమాచారం ఇచ్చాడు. విషయం అంపైర్లకు చేరింది.


ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ హెచ్సీఏ ఎండగట్టాడు. “ఐపీఎల్ లో ఇతర వేదికలో డగౌట్లను ఫ్లెక్సీ గ్లాస్ తో ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్ స్టేడియంలో మాత్రం కేవలం గొడుగుల కింద ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇవాళ లక్నోతో మాచ్ సందర్భంగా నోబాల్ ఇవ్వలేదని అభిమానులు మేకులు, బోల్టులు విసరడం మంచి పద్ధతి కాదు. దేవుని దయవల్ల ఎవరికీ ఏం కాలేదు. అయినా డగౌట్ ఏర్పాటులో ఇంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. హెచ్సీఏ నిర్వహణ లోపం ఏంటి అనేది మరోసారి బయటపడింది. కనీసం సరైన డగౌట్లు నిర్మించలేని పరిస్థితిలో హెచ్సీఏ ఉండడం దురదృష్టకరం” అంటూ ఘాటు వాక్యాలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news