సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన తొలి మ్యాచ్ లో దారుణ ఓటమిని చవి చూసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలం అయింది. దీంతో 61 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణత 20 ఓవర్ లలో 210 భారీ స్కోరు చేసింది. బట్లర్ (35), కెప్టెన్ సంజు సమ్సన్ (55) తో పాటు హెట్ మేయర్ కేవలం 13 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లు.. ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తల రెండు వికెట్లు తీశారు.
భువనేశ్వర్, రోమారియో షెఫర్డ్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. 211 భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (2), రాహుల్ త్రిపాటి (0), నికోలస్ పూరన్ (0), అభిషేక్ శర్మ (9), అబ్దుల్ సమద్ (4) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో 10.2 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి.. 37 పరుగులు మాత్రమే చేసింది.
తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఐడెన్ మార్క్రమ్ (57), రోమారియో షెఫర్డ్ (24) తో పాటు వాషింగ్టన్ సుందర్ (40) పోరాడిన ఫలితం దక్కలేదు. అయితే చివర్లో సుందర్ కేవలం వరుసగా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కేవలం 14 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 2 సిక్స్ లతో దాటిగా ఆడాడు.