ASIA CuP 2022 : అందరూ అనుకున్నదే జరిగింది. ఊహించినట్లే.. శ్రీలంక అద్భుతమే చేసింది. ఆసియా కప్-2022లో అంచనాలే లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దుబాయ్ వేదికగా ముగిసిన పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్ లో లంక, పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తోలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, పాక్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
లక్ష్య చేదనలో పాకిస్తాన్, 20 ఓవర్లలో 147 పరుగులకే ఆల్ అవుట్ అయింది. లంక యువ పెసర్ ప్రమోద్ మధుషాన్ 4 వికెట్లతో చెలరేగగా, స్పిన్నర్ 12 వ నిండు వనిందు హసరంగ 3 వికెట్లతో పాకిస్తాన్ నడ్డి విరిచాడు. ఈ విజయంతో శ్రీలంక ఆరో ఆసియా కప్ గెలుచుకుంది. ట్రోఫీలతో అందరికంటే ముందంజలో ఉంది.
అసాంతం రాణించిన పాక్, చివరిదైన కీలక పోరులో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను తడబడి అపజయాన్ని చేజేతుల కొని తెచ్చుకుంది. లక్ష చేదనలో పాకిస్తాన్ కు ఈ టోర్నీలో ఎప్పటిలాగే శుభారంభం దక్కలేదు. పేలవ ఫామ్ తో సతమతమవుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం (5) మరోసారి నిరాశపరిచాడు. బాబర్ ను అవుట్ చేసేందుకు శ్రీలంక భారీ వ్యూహం పన్నింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ప్రమోద్ మధు శంక, ఆ ఓవర్లో రెండో బంతిని లెగ్ సైడ్ దిశగావిసిరాడు అయితే షాట్ లెగ్ వద్ద అప్పటికే ఫీల్డర్ ను ఉంచిన లంకకు అజమ్ వికెట్ దక్కింది. దీంతో శ్రీలంక విజయం సాధించింది.