లొల్లి పెట్టి రాజకీయం చేసేవారికి అభివృద్ధి గురించి తెలియదు : శ్రీనివాస్‌ గౌడ్‌

-

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్స్‌ యూనియన్‌ నూతన భవనాన్ని ఆదివారం ఎక్సైజ్‌ శాఖ మంత్రి
శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే
దక్కుతుందని, పాలమూరును కడుపు నింపే జిల్లాగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రికి క్రేన్‌ సాయంతో భారీ గజమాలను వేశారు. అనంతరం కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో వడ్డెరబస్తీ అంటే ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండేదని, నేడు పట్టణంతో సమానంగా అభివృద్ధి
జరుగుతుందన్నారు. లొల్లి పెట్టి కాలయాపనతో రాజకీయం చేసేవారికి అభివృద్ధి గురించి తెలియదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్స్‌ భవనంలో వివిధ సదుపాయల నిమిత్తం రూ.5 లక్షలు కేటాయించనున్నట్లు వివరించారు. బీసీలకు విడుతల వారిగా బీసీబంధు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, ముడా చైర్మన్‌ వెంకన్న, కౌన్సిలర్‌ రవికిషన్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news