మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి

-

కరోనా వల్ల గత రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించలేదు. రెండేళ్లుగా భక్తులకు బ్రహ్మోత్సవాల వైభవం దక్కలేదు. అందుకే రెండేళ్ల తర్వాత అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీడీడీ వెల్లడించింది. నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈమేరకు డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

  • భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేశాం.
  • ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశాం.
  • గదులకు సంబంధించి ఆన్‌లైన్‌లోనే భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా 50శాతం గదులను అందుబాటులో ఉంచాము.
  • తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
  • సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
  • బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తాం.
  • గరుడ సేవ రోజు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
  • వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం.
  • భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య, వార సేవలు, ఉత్సవాలు ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా తితిదే పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news