Breaking News : తెలంగాణలో 1000 కోట్లతో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ..

-

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్‌ ఎకానామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు మంత్రి కేటీఆర్‌. ఈ నేపథ్యంలో తెలంగాణకు పెట్టుబడులను తీసుకువచ్చేందుకు వరుసగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది.

Stadler sets world record with battery-operated train | S-GE

రాష్ట్రంలో ఉన్న మేధో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్‌ స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నాయి. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఒప్పందం మేరకు రానున్న రెండేళ్లలో తెలంగాణలో రూ.1000కోట్లు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్‌లను కేవలం భారత్‌తో పాటు ఏషియా పసిఫిక్‌ రీజియన్‌కు సైతం ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో తమ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news