దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. మీకు కూడా స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉందా..? మీరు నామినీ పేరు అప్‌డేట్ చేయాలా..? అయితే ఇలా ఈజీ. నామినీని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఇప్పుడు నామినీ ని అప్డేట్ చేసే విధానాన్ని ఈజీ చేసేసింది.
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే అప్లికేషన్ ఫామ్‌లో నామినీ పేరు రాసే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు నామినీ వివరాలని ఇవ్వకపోతే ఇలా మీరు నామినీ పేరు అప్‌డేట్ చేయొచ్చు. ఈ మూడు పద్ధతుల్లో మీరు నామినీ వివరాలని అప్డేట్ చేసేయచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నామినీ పేరు అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నామినీ పేరు ఎలా అప్డేట్ చెయ్యాలి..?
మొదట మీరు ఆన్‌లైన్ ఎస్‌బీఐ వెబ్‌సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు Request & Enquries మీద నొక్కండి.
ఆ తరవాత ఆన్లైన్ నామినేషన్ పైన క్లిక్ చేయాలి.
మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసేసి… నామినీ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అంతే.
యోనో ఎస్‌బీఐ ద్వారా నామినీ పేరు ఎలా అప్డేట్ చెయ్యాలి..?
మొదట యోనో ఎస్‌బీఐ యాప్ లో లాగిన్ అవ్వండి.
ఇప్పుడు Services & Request పైన నొక్కండి.
అకౌంట్ నామినీ పైన క్లిక్ చేసి.. మేనేజ్ నామినీ పైన క్లిక్ చేయాలి.
అకౌంట్ నెంబర్ ఇచ్చేసి నామినీ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అంతే.