మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం మంచి అలవాట్లని అలవాటు చేసుకోవాలి లేదంటే అనవసరంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వంటివి కలుగుతూ ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం మూడు లీటర్ల వరకు మంచి నీళ్ళని తాగండి. తక్కువ నీళ్లు తాగడం వలన కిడ్నీ సమస్యలు కలుగుతాయి. ప్రతి చిన్న దానికి ఎక్కువ మందులు వేసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
ఉప్పు ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ సమస్యలు కలుగుతాయి కాబట్టి ఉప్పుని కూడా ఎక్కువ తీసుకోకండి. మూత్రం వస్తే, గట్టిగా ఆపేసుకుంటే ఎక్కువగా ప్రమాదం కలుగుతుంది కాబట్టి యూరిన్ వచ్చినప్పుడు వెంటనే యూరిన్ పాస్ చేయాలి లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉంటాయి.
మాంసాహారాన్ని ఎక్కువ తీసుకోవద్దు లేదంటే అనవసరంగా కిడ్నీ సమస్యలతో సతమతం అవ్వాలి. సరైన నిద్ర ప్రతి ఒక్కరికి ముఖ్యం. మంచి నిద్ర లేకపోయినా కిడ్నీ సమస్యలు కలుగుతాయి శీతల పానీయాల వలన కిడ్నీ సమస్యలు కలుగుతాయి. మోతాదుకు మించి పోయి ఆహారం తీసుకోవడం వలన కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి కాబట్టి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా కిడ్నీ సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అనవసరంగా ఇటువంటి చేయకండి మీరే ఇబ్బంది పడాలి.