సొంతిళ్లు ఉండాలనేది సగటు కుటుంబం కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఎన్ని కష్టాలు పడైన సొంతిళ్లు కట్టుకోవాలనుకుంటారు. అయితే అలాంటి వారందరికి పెరుగుతున్న రేట్లు ప్రతిబంధకంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ముఖ్యంగా సిమెంట్, స్టీల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రెండు వారాల్లో స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. టన్నుకు రూ. 10 వేల నుంచి 11 వేలు పెరిగింది. ఉదాహరణకు టీఎంసీ స్టీల్ ధర టన్నుకు గతంలో రూ. 60,180 ఉంటే ప్రస్తుతం రూ. 71,390కి చేరింది. ఇనుక ఖనిజం, కుకుంగి కోల్ ధరలు పెరగడం వల్లే స్టీల్ ధరలు పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు సిమెంట్ ధరలు కూడా పెరిగాయి. బ్రాండ్ ను బట్టి ఒక్కో బస్తాపై రూ. 40-50 వరకు కంపెనీలు పెంచాయి. డిమాండ్ ను బట్టి సిమెంట్ కంపెనీలు ధరలను పెంచడం పరిపాటిగా మారింది.