వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ.. అత్యాధునిక సేవలు అందించేందుకు 2 వేల బెడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.1100 కోట్ల పరిపాలన అనుమతులు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని అన్నారు.