మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సమంత… మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్…!

-

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మళ్లీ బిజీగా మారుతోంది. ఇప్పటికే పుష్ఫ సినిమాలో ’ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా..‘ పాటతో ఊపేసింది. పుష్ప సినిమా హైప్ పెంచడానికి సమంత పాట కూడా ఓ కారణమైంది. తొలిసారిగా ఐటెం సాంగ్ చేసిన సమంత ఆడియన్స్ ను తన అందంతో, డ్యాన్స్ తో ఫిదా చేసింది. మరో వైపు ’శాకుంతలం‘ అనే ప్యాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉంది. ఓటీటీ వెబ్ సిరీస్ లల్లో కూడా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ప్లేస్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా  సమంతను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఈ అవకాశం సమంతను వరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమాలో హీరోయిన్ గా సమంత ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news