దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజల వ్యతిరేకతకు గురైన ఆశలతో పెద్ద నోట్ల రద్దు కూడా ఒకటి. గతంలో అమలులో ఉన్న పెద్ద నోట్లు రూ. 1000 మరియు పాత రూ. 500 లను మార్చి, వాటి స్థానంలో కొత్తగా రూ. 500 నోటును మరియు రూ. 2000 నోటును తీసుకువచ్చారు. ఈ నిర్ణయం వలన మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇక ఆ తర్వాత ఇటీవల ఈ 2వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఓ డేట్ ను ఇచ్చి ఆ లోపు మీ దగ్గర ఉన్న నోట్ లను బ్యాంకు లలో జమచేయాలని చెప్పారు. దీనితో ప్రజల దగ్గర ఉన్న నోట్లు అన్నీ దాదాపుగా 93 శాతం వరకు రిజర్వు బ్యాంకు కు చేరాయని అధికారికంగా తెలిపారు. నిన్నటి వరకు బ్యాంకు లకు తిరిగి వచ్చిన రెండు వేల నోట్ల మొత్తం చూస్తే రూ. 3.32 లక్షల కోట్లని తెలుస్తోంది. ఇవి పోగా ఇంకా బ్యాంకు కు రావాల్సిన మొత్తం నోట్లు 24 వేల కోట్ల విలువైనవి రావాలంటూ చెబుతోంది.
ఇంకా సమయం ఈ నెల మాత్రమే ఉన్నందున మరి ఆ నోట్లు అనీ బ్యాంకు లకు వెలుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.