ఇంకా వారిని మరచిపోలేకపోతున్నారా..? అయితే తప్పక వీటిని గుర్తుపెట్టుకోండి..!

-

చాలామంది ప్రేమలో విఫలమైపోతుంటారు. అయినా సరే ఆ వ్యక్తిని మరచిపోలేకపోతూ ఉంటారు. మీరు కూడా లవ్లో ఫెయిల్ అయ్యారా ఆ ప్రేమని మర్చిపోలేక పోతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఇది చూడాల్సిందే. చాలా మంది ప్రేమలో పడతారు కానీ అందరూ ప్రేమలో సక్సెస్ అవ్వలేరు. ప్రేమలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. వివిధ రకాల కారణాల వలన లవ్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు.

relationship partners

 

అయితే ఒకవేళ కనుక లవ్ లో ఫెయిల్ అయితే కచ్చితంగా ఆ ప్రేమ నుండి బయట పడాలి తప్ప పదేపదే బాధపడకూడదు. చాలామంది ప్రేమించిన తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు జీవితాంతం ఆనందంగా ఉండాలని ఒకరి కోసం ఒకరు బతకాలని ఒకరి కోసం ఒకరు ఏమైనా చేయాలని ఇలా ఎన్నో… కానీ ఏదో ఒక రోజు అనుకున్నవి అన్నీ కూడా తారుమారైపోవచ్చు.

ఒక్కసారిగా ప్రేమ కుప్పకూలిపోవచ్చు. నిజానికి ఇలా దూరం అయ్యాక మనసుకి చాలా కఠినంగా అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ప్రేమించిన వ్యక్తి నుండి దూరంగా వెళ్లిపోవడం అనేది భరించలేనిది. పైగా ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఎలా మర్చిపోగలము…? చాలామంది జీవితంలో ఏదో ఓ దశ లో ఇది ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటప్పుడు భావోద్వేగాలు మన నియంత్రణ లేకపోతే అది ఎంతటి పరిణామానికైనా సరే దారితీస్తూ ఉంటుంది. మీరు కోల్పోయిన వాళ్ళని మిస్ అవుతున్నట్లయితే ఈ విధంగా అనుసరించండి.

వాళ్లు ఇక తిరిగి రారని అంగీకరించండి:

చాలామంది మళ్లీ వస్తారులే నా కోసమే వస్తారులే అని కలలు కంటూ ఉంటారు. నిజానికి వాళ్ళు రారు కాబట్టి మీరు వాళ్లు మీ జీవితంలోకి మళ్లీ రారు అని అంగీకరించండి. మీరు కనుక దీనిని అంగీకరిస్తే ఖచ్చితంగా వాళ్ల కోసం మీరు ఏ విధమైన ప్రయత్నాన్ని చేయకండి.

కలుసుకోవడానికి మీరు ఏ విధంగా ప్రయత్నాలు చేయకండి:

మెసేజ్ చేయడం లేదంటే సోషల్ మీడియాలో మళ్లీ ఫ్రెండ్స్ అవడం, వాళ్ళని కాంటాక్ట్ చేయకండి.

ప్రస్తుతం పై దృష్టి పెట్టండి:

మీరు ప్రస్తుతం పై దృష్టి పెడితే ఖచ్చితంగా ఆనందంగా ఉండొచ్చు. అంతేకానీ గతం అందించిన జ్ఞాపకాలనే తలుచుకుంటూ పదేపదే బాధపడొద్దు.

యోగా ధ్యానం చేయండి:

ప్రతిరోజు కాసేపు యోగా ధ్యానం మీద శ్రద్ధ పెట్టండి అవి మీతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాయి మీ బలాన్ని గుర్తించడానికి కూడా అవి సహాయపడతాయి. ఇలా ఈ విధంగా మీరు కనుక ఫాలో అయితే కచ్చితంగా మీరు వాళ్ళని మర్చిపోగలుగుతారు. ఆనందంగా ఉండగలరు.

Read more RELATED
Recommended to you

Latest news