శరవేగంగా చరణ్ సినిమా షూటింగ్…

మెగా పవర్ నటించిన ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాలు ఇటీవల విడుదలై సూపర్ హిట్ లుగా నిలిచాయి. అయితే.. చరణ్ తన తరవాత సినిమాపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో.. దిల్ రాజు నిర్మాతగా చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాను తెరకెక్కుతోంది. ఇంతకుముందే ఈ సినిమాకి సంబంధించిన ఓ నాలుగు షెడ్యూల్స్ ను పూర్తిచేయగా.. తాజాగా వైజాగ్ లో మరో షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టారు మేకర్స్.

అయితే.. చరణ్ కాలేజ్ కి సంబంధించిన సన్నివేశాలను .. ఆర్కే బీచ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ను .. చరణ్ కి పోలీసులతో గొడవ జరిగే సీన్ ను ఇంతవరకూ చిత్రీకరించినట్టుగా సమాచారం.. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్టుగా చెబుతున్నారు. కెరియర్ పరంగా ఇది చరణ్ కి 15వ సినిమా విశేషం. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది.