75వ స్వాతంత్ర్య దినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జనగణమన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని కూడళ్ల వద్ద ఈ రోజు ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆన్‌లైన్ కనెక్టివిటి ఆధారంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు.
డిజిటల్ అనౌన్స్ మెంట్ సిస్టమ్‌లో భాగంగా ఆన్‌లైన్ కనెక్టివిటీ అన్న అన్ని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు జనగణమన గీతాన్ని ప్లే చేశారు. దీని కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముందస్తుగా ప్రోగ్రాం చేశారు. ఆ తర్వాత టెలికాస్ట్ చేశారు. వీడియో ప్లే అయ్యే ముందు.. ‘దయచేసి అందరూ నిలబడండి. జాతీయ గీతాలాపన చేద్దాం’ అనే సందేశాన్ని వినిపించారు. ఆ తర్వాత రెండు సైరన్లు మోగిన తర్వాత జాతీయ గీతం ప్లే అయింది.
మూడు కమిషనరేట్ల పరిధిలో ‘జనగణమన’ గీతాలాపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.