ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఒక రీజన్ బలంగా ఉండాలి అని చెప్తారు. అసలు ఆత్మహత్యే ఒక తప్పు… చేసుకుంటే బలమైన కారణం ఏదైనా ఉండాలి. కొంత మంది చిన్న చిన్న కారణాల కోసం ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అవి సిల్లీ గా ఉంటాయి కారణాలు. తాజాగా ఒక అమ్మాయి చేసుకున్న ఆత్మహత్య చూస్తే ఇదే అనిపిస్తుంది. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పెద్దపల్లి జిల్లాలో కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో దివ్య భవాని అనే అమ్మాయి ఇంట్లో ఆమె అక్క కొడుకు ఉంటున్నాడు. స్కూల్ సెలవలు రావడంతో కొన్ని రోజుల నుంచి ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. ఆమె కూడా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటుంది. గురువారం మధ్యాహ్నం భోజన సమయంలో దివ్య ఆమ్లెట్ వేసుకుంది. అయితే అక్కడ ఉన్న తన అక్క కొడుకు లాక్కున్నాడని ఇరువురి మధ్య చిన్న గొడవ జరిగింది.
దివ్య జోక్యం చేసుకుని… ఆమ్లెట్ తిన్నందుకే ఆ పిల్లాడిని తిట్టాలా? అని ఆగ్రహం వ్యక్తం చేసాడు. తండ్రి తిట్టడం తో మనస్తాపానికి గురైన ఆమె గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని పురుగుల మందు తాగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంతోషంగా ఉన్న ఇంట్లో ఆమ్లెట్ పెట్టిన చిచ్చు ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది.