సుడిగాలి సుధీర్ కి దరిద్రంలా పట్టుకున్న అదృష్టం.. క్రేజ్ మామూలుగా లేదుగా..!!

-

ఏ హీరో అయినా సరే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే ఆయన తలరాత మారిపోయినట్టే.. లేదా ఒకటి రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యి ఆ తర్వాత విజయాన్ని అందుకుంటే ఆయన నక్కతోక తొక్కినట్టే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోని సుడిగాలి సుదీర్ కి కూడా అదృష్టం దరిద్రంలా పట్టుకుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ ఆ తర్వాత వెండితెరపై సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరోగా వెండితెరపై అడుగుపెట్టకముందు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పోషించిన ఈయన.. తనలో ఉన్న టాలెంట్ నిరూపించుకొని హీరోగా మారాడు.. కానీ సినిమాలు కలిసి రాలేదు.

త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు వంటి సినిమాలలో నటించినా గుర్తింపు రాలేదు కానీ తాజాగా గాలోడు సినిమాతో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమా జాబితాలో సుదీర్ సినిమా కూడా చేరిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే గాలోడు సినిమా విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు కూడా సుదీర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేశారు సుడిగాలి సుదీర్. గతంలో నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమా చేసిన ఒక ప్రముఖ దర్శకుడు ఇప్పుడు సుడిగాలి సుధీర్ కి కథ వినిపించినట్లు సమాచారం .

నాగార్జునతో రగడ సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వీరుపోట్లు.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం లాంటి సినిమాలకు కథలను అందించాడు. బిందాస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన ఇప్పుడు సుదీర్ తో మరొక మాస్ కమర్షియల్ హిట్టు కొట్టడానికి ఒక మంచి కథను ప్లాన్ చేసుకున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version