భారత దేశంలో మొత్తం 77మిలియన్ల మంది షుగర్ బారిన పడ్డారట. షుగర్ వల్ల సమస్య ఏంటంటే, దానితో పాటు మరిన్ని వ్యాధులను తెచ్చి పెడుతుంది. గుండె సంబంధిత సమస్యలు, రక్తపీడనంలో మార్పులు మొదలగు సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం కరోనా కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఐతే షుగర్ వ్యాధి ఉన్నవారు తీపి అస్సలు తినకూడదని అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం చక్కెరకి అనేక ప్రత్యామ్న్యాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఆ పదార్థాల్లో చక్కెర శాతం తక్కువగా ఉన్నప్పటికీ తీపిదనం ఎక్కువగా ఉంటుంది.
ఐతే ఇలాంటి పదార్థాలని తినేటపుడు కుడా వైద్యులకి సంప్రదించడం మంచిది. ఎందుకంటే, ఏ పదార్థమైనా ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది. మీకేది పనిచేస్తుందో మీ డాక్టరుని అడిగి మరీ తెలుసుకోండి.
చక్కెరకి గల ప్రత్యామ్నాయాలేంటో ఇక్కడ చూద్దాం.
కృత్రిమమైన తీపి పదార్థాలు..
మార్కెట్లో కృత్రిమమైన తీపి పదార్థాలు విరివిగా లభిస్తాయి. ఇవి చక్కెర కంటే ఎక్కువ తియ్యగా ఉంటాయి. వీటిని మీరు తీసుకునే ఆహారంలో కలుపుకోవచ్చు. కాకపోతే ముందుగా వైద్యుడికి సంప్రదించాలి.
తేనె
అడవిలో లభించే తేనె ఎలాంటి కల్తీ లేనటువంటిది. ఇది సహజమైన తియ్యని పదార్థం. ఇందులో జింక్, ఐరన్, కాల్షియం పొటాషియం, విటమిన్ బీ6 వంటి పదార్థాలు ఉంటాయి. ఎలాంటి ప్రాసెస్ చేయబడని తేనె మాత్రమే చక్కెర వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మటుకు మార్కెట్లో దొరికేవన్నీ ప్రాసెస్ చేసినవే. అందుకే డైరెక్టుగా అడవుల్లో నుండి తీసుకువచ్చినదై ఉండాలి.
ఖర్జూరం
ఖర్జూరంలో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బీ6 వంటివి ఉన్నాయి. ఇది సులభంగా జీర్ణం అవడంతో పాటు, రక్తంలో కొవ్వుని తగ్గించి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది.
కొబ్బరి చక్కెర, బనానా పేస్ట్, మాపిల్ సిరప్, మాంక్ ఫ్రూట్… మొదలగునవన్నీ చక్కెరకి ప్రత్యామ్నాయంగ ఉపయోగపడతాయి.