సుమన్ ప్రతిరోజూ స్టేషన్లో సైన్ చేసి..తీసిన సినిమా ఏదంటే..?

-

హీరో సుమన్ కేవలం సినిమాలలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచాడు. ఆయనకు జైలు జీవితం ఎంతో నేర్పించింది అని కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఎదుటివారికి కాదనకుండా సహాయం చేయడంలో ముందుండే సుమన్ తన విషయంలో మాత్రం ఎవరు సహాయం చేయలేదని చెబుతూ ఉంటారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాతే సుమన్ కి అసలు సమస్య మొదలయ్యింది. ఆ సమయంలో ఎవరూ కూడా అతనిని నమ్మి సినిమాలు ఇవ్వలేదట. దాంతో అవకాశాలు లేక పూర్తిగా ఇబ్బంది పడ్డారట.

ఆ సమయంలో జైలు నుంచి ఇంటికి వచ్చి సుమన్ కొన్నాళ్లపాటు చంగల్పట్టు రోడ్డులో హౌస్ అరెస్ట్ లోనే ఉంచారు. పైగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టి ఆ తర్వాత పోలీస్ పర్యవేక్షణలోనే షూటింగ్ కి వెళ్ళాలి అనే నిబంధన కూడా ఉండేది. అయితే సరిగ్గా అదే సమయంలో 1988లో భానుచందర్ దగ్గరికి ఒక కథ వచ్చింది. ఆ సమయంలో భానుచందర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే బందిపోటు కథ విన్న తర్వాత అది తనకంటే సుమన్ కు బాగా సూట్ అవుతుందని నిర్మాత కాంట్రాగడ్డ ప్రసాద్ గారికి సూచించాడట భానుచందర్ . ఆ సినిమాను ఎల్వి ప్రసాద్ దర్శకత్వం చేయగా ఆ సినిమాలో కల్పన, గౌతమి, పూర్ణిమ హీరోయిన్లుగా నటించారు.

అలా బందిపోటు సినిమాని సుమన్ కి భానుచందర్ ఇచ్చేసాడు. ఆ సినిమా విడుదలయ్యి సుమన్ కు మంచి విజయాన్ని అందించింది. అయితే బందిపోటు సినిమా షూటింగ్ సమయంలో సుమన్ ప్రతిరోజు స్టేషన్ కి వెళ్లి సైన్ చేసి పోలీసుల ఆధ్వర్యంలోని సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news