సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ కుడి చేతికి గాయమైంది. దీంతో అతడు ఒక్క ఓవర్ కూడా వేయలేదు. అయితే వాషింగ్టన్ సుందర్ దురదృష్టవశాత్తు తదుపరి మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని హెడ్ కోచ్ టామ్ మూడీ… ప్రకటించారు.
ఈ సీజన్ లో గాయం కారణంగా ఇప్పటికే వాషింగ్టన్ సుందర్ మూడు మ్యాచ్లు ఆడిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన సుందర్ నిన్నటి మ్యాచ్ లో అతనికి గాయం కావడం గమనార్హం.
కాగా చెన్నై పగ్గాలు ధోనీ చేతికి వచ్చిన ఉత్సాహంతో సీఎస్‌కే జట్టు వీర విధ్వంసం సృష్టించింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు శివతాండవం ఆడారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (99), కాన్వే (85 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అయితే హైదరాబాద్ టార్గెట్ రీచ్ కాలేక పోయింది.