IPL Auction : బోణీ కొట్టిన స‌న్ రైజ‌ర్స్.. రూ. 8.75 కోట్లకు వాసింగ్ట‌న్ సుంద‌ర్

-

బెంగ‌ళూర్ వేదికగా జ‌రుగుతున్న మెగా వేలంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బోణీ కొట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ మోడ్ లో ఉన్న స‌న్ రైజ‌ర్స్.. స్టార్ ఆల్ రౌండ‌ర్ వాసింగ్ట‌న్ సుంద‌ర్ కోసం తీవ్రంగా శ్ర‌మించింది. సన్ రైజ‌ర్స్ తో పాటు ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ కూడా భారీగా బిడ్ వేసింది. కానీ చివ‌రికి ఆల్ రౌండ‌ర్ వాసింగ్ట‌న్ సుంద‌ర్ ను రూ. 8.75 కోట్ల‌కు ద‌క్కించుకుంది. కాగ వాసింగ్ట‌న్ సుంద‌ర్ దీనికి ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ కు ప్రాతినిథ్యం వ‌హించాడు.

టీ 20 లో వాసింగ్ట‌న్ సుంద‌ర్ కు ఆల్ రౌండర్ గా మంచి రికార్డు ఉంది. వాసింగ్ట‌న్ సుంద‌ర్ ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 42 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 27 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అలాగే 111 పైగా స్ట్రైక్ రేటు తో బ్యాటింగ్ చేశాడు. అయితే సుంద‌ర్ త‌న బౌలింగ్ తో మ్యాచ్ ల‌ను మ‌లుపు తిప్ప‌గల సామ‌ర్థ్యం ఉన్నవాడు. గ‌తంలో బెంగ‌ళూర్ ను అనేక సార్లు విజ‌య తీరాల‌కు చేర్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news