తెలంగాణ రాష్ట్ర దళితులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. పది లక్షల తో పాటు అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించడమే దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం అని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఇదివరకు దళితులకు రాని ఎన్నో ఫెసిలిటీ లను ఇప్పుడు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రంగంలో దళితులకు కూడా రిజర్వేషన్లు కలిగించడమే దళిత బంధు ముఖ్య ఉద్దేశమని… విదేశీ విద్య లో కూడా పేద విద్యార్థులకు 20 లక్షలు ఇచ్చి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఉద్యోగులకు సంబంధించి చిన్న చితకా సమస్యలు… వాటిని అధిగమిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని… ఉద్యోగుల సర్వీసు రూల్స్ మారాలని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులను కోరేది కూడా అదేనని…. సర్వీసు నిబంధనలు సరళీకరణ చేయాలని తెలిపారు.