రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ..రూ.500 కోట్లు విడుదల

-

కేసీఆర్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామ గుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఏకంగా.. రూ. 500 కోట్లు కేటాయించింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ విషయాన్ని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు వైద్య కళాశాలకు ప్రత్యేక నిధుల మంజూరు అయినట్లు ఎన్.శ్రీధర్ వివరించారు.

kcr
kcr

సోమవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు సీఎండీ ఎన్.శ్రీధర్. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు.. సింగరేణి కార్మికుల 50 ఏళ్ల కల సాకారం కానుంది. ఇక రెండేళ్ల లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి కానున్నాయని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే.. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి వైద్య విద్య రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news