కృష్ణా పాలిటిక్స్‌లో ట్విస్ట్‌లు: వంగవీటిపై రెక్కీ? ఏం జరుగుతోంది?

-

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి జిల్లాల్లోనూ రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య హోరాహోరీ వాతావరణం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న దివంగత వంగవీటి రంగా తనయుడు రాధా సరికొత్త ట్విస్ట్‌లు ఇస్తున్నారు. కాపు వర్గం కోసం రంగా ఎలా పనిచేశారో అందరికీ తెలిసిందే. రంగా అంటే కాపు వర్గానికి ఒక పెద్ద దిక్కు.

ఇక రంగా తర్వాత రాధా కాపు వర్గం కోసం కృషి చేస్తున్నారు. ఇలా తన వర్గం కోసం పనిచేస్తున్న రాధా..రాజకీయంలో ఎప్పుడు ఏదొక మలుపు ఉంటూనే ఉంటుంది. అసలు గత ఎన్నికల్లో ఈయన టీడీపీలో చేరడమే పెద్ద ట్విస్ట్. ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో, రాధా కాస్త టీడీపీకి దూరం జరిగారు. అదే సమయంలో ఈయన జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ ఆ మధ్య ఈయన టీడీపీ తరుపున గుడివాడలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చర్చలు జరిగాయి. మళ్ళీ ఆయన, మంత్రి కొడాలి నానితో భేటీ కావడంతో సీన్ మారింది. రాధా మళ్ళీ వైసీపీలోకి వెళ్తారని కథనాలు వచ్చాయి.

తాజాగా రాధా…కొడాలి నాని, వంశీలతో భేటీ అయ్యారు. రంగా విగ్రహావిష్కరణలో వారిని కలిశారు. ఈ క్రమంలోనే తనని చంపడానికి కొందరు చూస్తున్నారని, రెక్కీగా కూడా నిర్వహించారని ట్విస్ట్ ఇచ్చారు. కానీ ఎవరు రెక్కీ పెట్టారు..ఏ పార్టీ వారు పెట్టారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే వంశీ, కొడాలిలు…రాధాని వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రాధా వైసీపీలోకి వెళ్తారా? లేదా? అనేది మరొక ట్విస్ట్. వచ్చే ఎన్నికల వరకు రాధా పోలిటికల్ కెరీర్‌పై క్లారిటీ వచ్చేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news