కేంద్రం సంచలన నిర్ణయం.. జనవరి 31 వరకు దేశంలో కరోనా ఆంక్షలు

-

దక్షిణాఫ్రికా దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేరింట్‌ ఇప్పటికే 90 దేశాలకు పాకిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌.. మన దేశంలోనూ క్రమ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే 550 కి పైగా దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. అంతేకాదు… మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ లాంటి రాష్ట్రాలు అయితే… నైట్ కర్ఫ్యూ ను కూడా అమలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్నయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా.. కోవిడ్ ఆంక్ష‌లను జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ఆంక్ష‌లు పొడిగించిన కేంద్ర హోంశాఖ‌… క‌రోనా వ్యాప్తితో ఆంక్ష‌లు పొడిగించింది. ఈ నిబంధనలను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news