ఇళ్లలో కూడా మాస్కులు ధరించే పరిస్థితి ఏర్పడింది… ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్ట్.

-

వాయు కాలుష్యం, పొగ మంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో వాయు కాలుష్యం పీక్స్ వెలుతోంది. ఇన్నాళ్లు కోవిడ్ వల్ల వణికిపోయిన ఢిల్లీ ప్రజలు.. ప్రస్తుతం వాయు కాలుష్యం ఢిల్లీ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలనుల తగలబెడుతుండటంతో కాలుష్యం పెరుగుతోంది.

supreme-court

తాజాగా ఢిల్లీలో కాలుష్యంపైన సుప్రీం కోర్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్ట్ లో ఈ రోజు విచారణ జరిగింది. ఇళ్లలో కూడా మాస్కులు వేసే పరిస్థితి ఢిల్లీలో ఏర్పడిందని సీజేఐ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఢిల్లీలో రెండు రోజుల లాక్ డౌన్ ను పరిశీలించాలని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సోలిసిటర్ జనరల్ ను ప్రశ్నించారు. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను తగులబెడుతుండటంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించింది. వెంటనే పంజాబ్, హర్యాణా రాష్ట్రాలు ఈ అంశంపై సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. రెండు మూడు రోజుల్లో కాలుష్యంపై అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సుప్రీం కోర్ట్. అయితే ఇవాళ వాయు కాలుష్యంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామని సోలిసిటర్ జనరల్ సుప్రీం కోర్ట్ కు తెలిపారు. తదుపరి విచారణను సుప్రీం కోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news