ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధును నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై నాంపల్లి సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది.
ఈ విచారణను క్వాష్ చేయాలని కోనేరు మధు తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. మధు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. మధు క్వాష్ పిటిషన్‌పై గతేడాది జులై 18న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఈడీ పిటిషన్‌పై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది.