ఈ ప్రపంచంలో..ఎంతో మంది ఎన్నో వింత రోగాలతో బాధపడుతూ ఉంటారు.. కొన్నిసార్లు మనకు ఉన్న చిన్నచిన్న సమస్యలకే ఇదేంట్రా జీవితం అని నిట్టూరుస్తాం. కానీ..కనీసం తినడానికి బాడీ సహకరించని వారు ఎంతో మంది..ఏదైనా తింటే చర్మవ్యాధులు..గట్టిగా నవ్వినా వాళ్లకు ప్రమాదమే.. ఇలాంటి వార్తలను మనం చూసి ఉంటాం.. కానీ ఆమెది ఇంకా దారుణమైన వ్యాధి.. రోజులో 23 గంటలు కదలలేని స్థితి.. మంచం మీదే ఉండాలి..పది సార్లైనా వాంతులు చేసుకుంటుంది. బతికి ఉండగానే ప్రత్యక్ష నరకం చూస్తుంది..
ఆమె రోజుకి 23 గంటలు కదల్లేని స్థితిలో మంచం మీదే ఉంటుంది. రోజుకు కనీసం 10 సార్లు వాంతులు, మూర్చలు రావడంతో నరకం చూస్తోంది. ఆమెకు వచ్చిన వింత వ్యాధి గురించి తెలుసుకోడానికి ఆమె ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. కానీ, వైద్యులు స్పష్టంగా ఆమెకు వచ్చిన వ్యాధి గురించి చెప్పలేకపోయారు. దీంతో ఆ మహిళే తన వ్యాధికి పేరు పెట్టుకుంది. అదే ‘అలర్జీ టు గ్రావిటీ’. కనీసం రెండు నిమిషాలు కూడా నిలబడలేని దయనీయమైన దుస్థితి ఆమె.
అమెరికాకు చెందిన 28 ఏళ్ల లిండీ జాన్సన్ ఒకప్పుడు యూఎస్ నేవీలో పని చేసేది. కానీ, ఇప్పుడు ఆమె ఓ వింత వ్యాధితో బాధపడుతుంది.. ప్రపంచంలోనే అతి తక్కువ మందికి ఈ వ్యాధి వస్తుందట. ఆమె కనీసం మూడు నిమిషాలు కూడా నిలబడలేదు, అందరిలా కాళ్ళు చాపి కూర్చోలేదు, నిలబడలేదు, నడవలేదు. 2015లో జాన్సన్ పొత్తికడుపు, వెన్నునొప్పి వచ్చింది. సంవత్సరాలు గడిచే కొద్ది ఆమెలో ఈ లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. రోజుకి కనీసం 10 సార్లు విపరీతంగా వాంతులు చేసుకోవడం, మూర్ఛపోవడం జరిగింది. ఏళ్లపాటు వైద్యులు పరీక్షించినా ఆమెకువచ్చిన వ్యాధి ఏంటి అనేది తెలుసుకోలేకపోయారు. 2022లో ఆమెకి ఆర్థోస్టాటిక్ టాచికార్డియా సిండ్రోమ్(PoTS) వచ్చినట్లు నిర్ధారించారు.
ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు నిలబడితే రక్త ప్రసరణ తగ్గి హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరుగుతుంది. జాన్సన్ తన వ్యాధికి ‘అలర్జీ ఆఫ్ గ్రావిటీ’గా పేరు పెట్టారు. ఆమె మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు నిలబడలేదు. మంచం మీదే రోజంతా గడపాల్సిన పరిస్థితి. అనారోగ్యం కారణంగానే తన చేసే జాబ్ నుంచి 2018లో వచ్చేసిందట.
తీవ్రమైన కడుపు నొప్పి రావడం, వాంతులు, మూర్ఛ పోవడం వంటి సమస్యలతో బాధపడేదానిని చెప్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.. ‘2022లో నా పరిస్థితి మరింత దిగజారింది. వంగడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను. తర్వాత నన్ను పరిశీలించిన కార్డియాలజిస్ట్ నాకు PoTS ఉందని అనుమానించి పరీక్షలు చేశారు’.
ప్రస్తుతం జాన్సన్ వైద్యుల పర్యవేక్షణలో ఉండి ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స వల్ల ఇప్పుడు తన పరిస్థితి కాస్త తన భర్త జేమ్స్ మీదే అన్నిటికీ ఆధారపడుతుందట. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ జాన్సన్ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు బెడ్ మీదే ఉండి డిగ్రీ చేస్తోంది. తన ఉద్యోగంలో మళ్ళీ చేరి ఇంటి నుంచి పని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందట..
అసలు బతకడమే కష్టంగా ఉన్న ఆమె..ధైర్యాన్ని కోల్పోకుండా ఇంకా చదువుకోవడం, ఉద్యోగం చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం.. మనలో ధైర్యం చావనంత వరకూ మనం ఆశయం నీరుగారిపోదు..!
-Triveni Buskarowthu