పాన్ కార్డు లో మీ ఇంటి పేరుని ఇలా సులభంగా మార్చేయచ్చు..!

-

పాన్ కార్డు చాలా ముఖ్యమైనది. చాలా వాటికీ ఇది ప్రూఫ్ గా పని చేస్తుంది. బైక్‌, కారు, చిన్న ఫ్లాట్‌ నుంచి ఏది కొన్నా కూడా పక్కా పాన్ కార్డు ఉండాలి. ఈరోజుల్లో పాన్ కార్డు చాలా అవసరంగా మారింది. అందుకే కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ కూడా పాన్ కార్డు ఉండాలి. పాన్‌ కార్డ్ తీసుకున్న తర్వాత వాటిలో మార్పులు చేసుకోవాలి. ఒక్కోసారి పాన్ కార్డు లో మన పేరునో లేదంటే అడ్రెస్ ని కానీ ఇంటి పేరు ని కానీ మార్చుకోవాల్సి ఉంటుంది.

మహిళలు వివాహామైన తర్వాత ఇంటి పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు కూడా మీ ఇంటి పేరు ని మార్చుకోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. ఈజీగా పాన్ కార్డు లో ఇంటి పేరు ని మార్చేసుకోవచ్చు.

పాన్ కార్డు లో ఇంటి పేరు ని మార్చుకోవడానికి మొదట మీరు www.tin-nsdl.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఆ తరవాత మీరు సర్వీసెస్‌ విభాగం లో PAN అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చెయ్యండి.
ఆ తర్వాత కింద Change/Correction in PAN Data మీద నొక్కండి.
అప్లికేషన్‌ టైప్‌ ని సెలెక్ట్ చేసుకుని ఛేంజేస్‌ ఆర్‌ కరెక్షన్‌ ఇన్‌ ఎగ్జిస్టింగ్ పాన్‌ డేటా మీద సెలక్ట్‌ చేసుకోవాలి.
పాన్‌ నెంబర్‌, పేరు, పుట్టిన తేదీ ని ఇవ్వండి.
ఈమెయిల్‌, ఫోన్‌ నెంబర్‌ వివరాలను కూడా ఎంటర్ చెయ్యండి.
సబ్‌మిట్ చేయగానే మీకు ఒక టోకెన్‌ నెంబర్‌ వస్తుంది. కింద బటన్‌ నొక్కగానే పేరు కరెక్షన్‌కు సంబంధించి పేజీ ఓపెన్‌ అవుతుంది.
పేరు, పుట్టినరోజు, ఫోన్‌ నంబరు వీటిని మీరు సెలెక్ట్ చెయ్యండి.
మార్పులు చేసేసాక ఆ తర్వాత నిర్ధేశించిన పేమెంట్‌ చెయ్యండి.
మీరు కార్డును అప్‌డేట్‌ చేసినట్లు ఓ స్లిప్‌ వస్తుంది. చేసుకోని దానిపై రెండు ఫొటోలు అతికించి.. వీటిని మీరు ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయానికి పంపాల్సి వుంది.

ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయము అడ్రెస్స్: NSDL e-Gov at Income Tax PAN Services Unit, NSDL e-Governance Infrastructure Limited, 5th Floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8, Model Colony, Near Deep Bungalow Chowk, Pune- 411016

 

Read more RELATED
Recommended to you

Latest news