సుషాంత్ అభిమాని ఆత్మహత్య..!

-

బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజపుట్ ముంబైలోని అతని నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఎందరినో కలచివేసింది. ఆయన మరణంపై ఎందరో దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు… ఎన్నో అనుమాలు సైతం వెలుగులోకి వచ్చాయి. అయితే ఆయన మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఎంత‌గానో క‌ల‌త చెందిన సుషాంత్ అభిమాని సూసైడ్ చేసుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ వ్యక్తి సుషాంత్ వీరాభిమాని. అయితే సుషాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని తెలుసుకున్న అతను కూడా సూసైడ్ లెట‌ర్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ లెట‌ర్‌లో నా హీరో ఆత్మ‌హత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా అంటూ రాసి ఉంద‌ని పోలీసులు పేర్కొన్నారు. సుషాంత్ సింగ్ మరణం తట్టుకోలేక ఇప్పటికే ఆయన వదిన మరణించిన విషయం అందరికీ తెలిసిందే. సుషాంత్ మృతిపై అనేక అనుమానాలు ఉండటంతో పోలీసులు చాలా లోతుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news