భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ థాక్రేకి కంప్లయింట్ చేశారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకుకు ఫోన్ చేసి బెదిరించారని ఠాక్రేకి కంప్లైంట్ చేశారు. తన కొడుకుకు ఫోన్ చేసి బూతు పదాలతో దూషించి చంపుతామని బెదిరించారని వివరించారు.
మాణిక్ రావు ఠాక్రే కు ఫిర్యాదు చేశానని.. ఈ అంశం ఏఐసీసీ పరిధిలోకి వెళ్లింది కనుక ఇక ఏమీ మాట్లాడనని అన్నారు. పార్టీకి నష్టం చేసే చర్యలు తాను చేయనన్నారు. క్షమాపణలు చెప్పాలని కూడా అడగనన్నారు చెరుకు సుధాకర్. ఆయన వల్ల మునుగోడులో పార్టీకి నష్టం జరిగినా, పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు. వెంకట్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నేను అడగలేదన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీని కోరానన్నారు.
బడుగు , బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కోమటిరెడ్డికి బెదిరింపు ఫోన్లు ఎవరు చేస్తున్నారో తనకి తెలియదన్నారు. నల్లగొండలో మేము ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు లేవన్నారు. సోషల్ మీడియాలో ఎవరో ఏదో కామెంట్స్ చేశారని కార్యకర్తలను రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టారని ఆరోపించారు. కోమటిరెడ్డికి బెదిరింపు కాల్స్ చేసేవాళ్ళపై చర్యలు తీసుకోవాలన్నారు.