BREAKING : మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు

-

BREAKING : మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ఈ మేరకు మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు వేస్తూ.. ఆర్వోను మార్చాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను ఈసీకి పంపారు అధికారులు. ఇక ఇవాళ సాయంత్రం లోగా కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

అయితే.. ఈ వేటుపై మునుగోడు రిటర్నింగ్ అధికారి కూడా స్పందించారు. నన్ను ఈసీ వివరణ అడిగిందని.. బాధ్యతల నుంచి నన్ను తప్పించినట్టు నాకు సమాచారం లేదని వెల్లడించారు మునుగోడు రిటర్నింగ్ అధికారి. నా విచక్షణ అధికారాలను ఉపయోగించి గుర్తులను కేటాయించానని తెలిపారు. ఇక అటు మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇష్యూపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖ రాశారు. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.

Read more RELATED
Recommended to you

Latest news