“స్వాతిముత్యం” మూవీ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

-

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం. ఓ అమ్మాయికి మరియు ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు అలాగే జరిగే సంఘటనలు ఇవన్నీ స్వాతిముత్యం సినిమాలో చూపించనున్నారు. ప్రముఖచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా లోని ” డుం డుం డుం” అంటూ సాగే పెళ్లి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. మహతి సాగర్ స్వరపరిచిన ఈ పాట మ్యారేజ్ వైబ్స్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సితార ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news