కోపంలో ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..!

-

కోపం ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. చిన్న చిన్న సందర్భాలలో కానీ ఏదైనా పెద్ద విషయంలో కానీ కోపం రావడం సహజం. కొంత మంది చిన్న చిన్న విషయాలకి కోప్పడితే కొంత మంది కి మాత్రం బాగా ఇబ్బంది పడినప్పుడు మాత్రమే కోపం వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే కోపం లో నోరు జారడం మంచిది కాదు. కోపంలో నోరు జారడం వలన తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది పైగా ఇది ఎదుటి వాళ్ళని కూడా బాధ పెడుతుంది.

కొంత మందికి కోపం వస్తే ఏం మాట్లాడతారో కూడా తెలియదు. కోపంలో మాట్లాడడం వల్ల ఇద్దరు వ్యక్తులు మధ్య కానీ రెండు కుటుంబాల మధ్య కానీ గొడవ మొదలవుతుంది. ఒక్కొక్కసారి చిన్నచిన్న విషయాల్లో వచ్చిన కోపం శాశ్వతంగా మనుషుల్ని దూరం చేసేంతలా మారిపోతుంది.

ఏదేమైనప్పటికీ కోపం నీ కంట్రోల్ చేసుకోవడం చాలా మంచి విషయం నోరు జారితే అసలు మళ్ళీ దానిని వెనక్కి తీసుకోవడానికి కూడా అవ్వదు. కోపం ప్రతి ఒక్కరికి సహజంగా వస్తుంది. కానీ దానిని ఎంత వరకు కంట్రోల్ చేసుకున్నాము అనేది చాలా ముఖ్యమైనది అయితే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేసే అర్హత ఉంది కానీ ఏ సమయంలో ఎలా మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం. అయితే ఒక వ్యక్తి మీద ప్రేమ ఎలా సాధారణంగా వస్తుందో కోపం కూడా అలానే సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది బాగా కోపం వచ్చినప్పుడు రెండు విషయాలు మర్చిపోకండి.

దేనికి రియాక్ట్ అవ్వాలి దేనికి రెస్పాండ్ అవ్వాలి. ఈ రెండూ కూడా గుర్తుంచుకోండి అప్పుడు కచ్చితంగా కోపాన్ని అధిగమిస్తారు. అన్నిసార్లు రెస్పాండ్ అవ్వక్కర్లేదు కొంచెం రియాక్ట్ అయినా సరిపోతుంది. కొన్నిసార్లు మాత్రం రెస్పాండ్ అయ్యి తీరాలి వీలైనంతవరకు పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఉండండి. కోపం తో అనవసరంగా నోరు జారితే తర్వాత బాధపడాలి ఎదుటి వాళ్లు కూడా విపరీతంగా బాధపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news