ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే వీటిని తీసుకోండి..!

-

సన్నగా ఉన్నామని బరువు పెరగాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్యకరంగా బరువు పెరగాలి. అటువంటి వాళ్ళు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి వీలవుతుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ ఆహార పదార్థాల గురించి చూసేయండి.

పాలు:

పాలలో కొవ్వు మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది. పాలని కనుక ప్రతిరోజూ మీరు మీ డైట్ లో తీసుకుంటే ఫిజికల్ డెవలప్మెంట్ త్వరగా అవుతుంది. అలానే ఇది మీ ఎముకలకి, దంతాలకు కూడా మంచిది.

అన్నం:

బియ్యంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి త్వరగా బరువు పెరగాలనుకొనే వాళ్ళు ఎక్కువగా అన్నం తినొచ్చు. ఒక కప్పు అన్నం ఎక్కువ కేలరీలను ఇస్తుంది. పైగా ఇది వండుకోవడం కూడా చాలా సులభం. మీరు అన్నం తో పాటు సోయాబీన్స్ లేదా ఏదైనా కాయగూరలను తీసుకుంటే మరింత న్యూట్రీయాంట్స్ మీకు అందుతాయి. పైగా రుచిగా కూడా ఉంటుంది.

చికెన్:

చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

ఖర్జూరం మరియు అరటిపండు:

ఖర్జూరం లో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే అరటి పండ్లు కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీరు ఈ రెండిటినీ కలిపి మిల్క్ షేక్ చేసుకునే తీసుకోవచ్చు.

బెల్లం-శెనగలు:

బెల్లంలో క్యాల్షియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. అలసిపోయినా తక్షణ శక్తిని ఇస్తుంది కాబట్టి రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ మీకు లభిస్తుంది.

బాదం:

ప్రతిరోజు మీరు బాదంని తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి సులువుగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.

ప్రోటీన్స్:

బరువు పెరగాలని అనుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఎక్కువ ప్రోటీన్స్ ను తీసుకోండి. మాంసం, చేప, గుడ్లు, డైరీ ప్రొడక్ట్స్ వంటివి తీసుకోండి.

సోయాబీన్స్ :

సోయాబీన్స్ని ఉదయాన్నే ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల శక్తి బాగా వస్తుంది. అలానే ఇది ఒంట్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది మరియు ప్రోటీన్స్ ని పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news