హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా? అయితే, వీటిని మర్చిపోకండి..

-

కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి జీవితం మీద నమ్మకం లేదు. అయితే మన తర్వాత వాళ్ళు అయినా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశ్యం తో హెల్త్ ఇన్సూరెన్స్ లను తీసుకుంటున్నారు.. దాంతో ఇన్సూరెన్స్ తీసుకొనే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.. అయితే ఎప్పుడు హెల్త్‌ పాలసీలు తీసుకోవడం మంచిది? ఎలాంటి పాలసీలు కొనుగోలు చేయాలి? నియమ, నిబంధనలు ఏంటనే అంశంపై చాలా మందికి అవగాహన ఉండటం లేదు. దీంతో చాలా ఆలస్యంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకొని ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలి..

 

చాలా మంది ఉద్యోగులు తాము పని చేస్తున్నంత కాలం యజమాని అందించిన వైద్య కవరేజీ సరిపోతుందని భావిస్తారని, కానీ అది పూర్తిగా సరైనది కాదని అన్నారు. ఎంప్లాయర్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉండటం మంచిదేనని, క్లెయిమ్ చేయవలసి వస్తే, ముందుగా అందులో నుంచే చేయవచ్చని పేర్కొన్నారు. కానీ దానిపైనే ఆధారపడటం సరికాదని కొందరు అంటున్నారు.వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ వస్తాయి..అయితే సేవింగ్స్‌ ఆసుపత్రి ఖర్చులకు కరిగిపోకుండా ఉంటాయన్నారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్‌ కొంటే.. అప్పుడు ఏవైనా ఇతర అనారోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉందన్నారు..

రిటైర్‌మెంట్‌కు కొన్ని సంవత్సరాల ముందే పాలసీని కొనుగోలు చేయడం మంచిదని చెప్పారు. రిటైర్‌మెంట్‌ కు దగ్గరలో ఉన్నవారు ప్రత్యేకంగా మెడికల్‌ అవసరాలకు ఉపయోగ పడుతుంది..ఆస్పత్రిలో చేరే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. అవి కాకుండా తరచూ హెల్త్‌ చెకప్‌ల కోసం ఆస్పత్రులను సందర్శించాల్సి ఉంటుంది.. చిన్న చిన్న అవసరాలకు, మెడికల్ ఖర్చులకు వాడుకోవడం మంచిది..అలాగే అవసరాలను తీర్చుకోవడానికి రిటైర్‌మెంట్‌ అయిన వారిని ప్రత్యేక ఫండ్‌ ఉపయోగపడుతుంది.. ఇన్సూరెన్స్ తీసుకొనే వాళ్ళు వీటిని దృష్టిలో ఉంచుకొని తీసుకొని పాలసిని తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news