ప్రేమపూర్వక రాజకీయాలు చేయాలి.. చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి తలసాని

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ మరోసారి స్పందించారు. ఏపీలో చంద్రబాబును జైల్లో పెట్టడం మనం చూశామని, ఈ అరెస్ట్ ఘటన ఎవరికైనా బాధ కలిగిస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి తలసాని. రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలు మంచిది కాదని, ప్రేమపూర్వక రాజకీయాలు చేయాలని మంత్రి తలసాని సూచించారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే చేశామని మంత్రి తలసాని అన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కాంగ్రెస్‌, బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్‌దే విజయమన్నారు. మనకు ఎవరు పోటీ కాదు, మనకు మనమే పోటీ అన్నారు. త్వరలో నామినేషన్ వేసి ఆ తర్వాత నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తలసాని తెలిపారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విభేదాలకు తావులేకుండా కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు మంత్రి తలసాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version