అరే.. ఈరోజు వాలంటైన్స్ డే కదా..ఇంకా సింగిల్ గానే ఉన్నారా? అయితే ఇలా చేసి చూడండి.!

-

ప్రేమికులరోజు అంటే..ప్రేమికులకు మాత్రమే అనుకుంటారు చాలామంది..జీవితంలో మనకు ఇంకా లవర్ దొరకలేదంటే..ఇక ఈరోజున చాలామంది కాస్త దిగాలుగానే ఉంటారు. జీవితానికి ఒక లవర్ లేదు పాడు లేదు..అనుకుంటూ..సాడ్ గా ఉంటారు. ఇక వారికి ప్రేమికుల రోజైనా పెద్ద తేడా ఏం ఉండదు. నార్మల్ డేస్ లో ఉన్నట్లే ఉంటారు. ప్రేమ అనేది కేవలం జంటల మధ్య ఉండేది మాత్రమే కాదు.. అది విశ్వవ్యాప్తమైనది.. అందుకే ప్రేమికుల రోజును జంటగా లేని వారు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి, ఈ వేలంటైన్స్ డేకి మీరూ సింగిల్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం రండి..

మీకు మీరే వేలంటైన్!

ప్రపంచంలో మనల్ని ఎంతగానో ఇష్టపడే మొదటి వ్యక్తి ఎవరో తెలుసా..మీరే.. అవును.. మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఈ లోకంలో ఎవరూ ఉండరు.. అందుకే సెల్ఫ్ లవ్ బెస్ట్ లవ్..ఎక్కడైనా సరే మన ఆనందానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మరాముడిని సరిపడా భోజనం పెట్టాలి..ఆత్మాభిమానం లేనిచోట మన నీడకూడా పడొద్దు..అలా మనల్ని మనం గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ ఉండాలి..మీ కంటే ఏదీ ఎక్కువ కాదు..ఒకరి కోసం..మన శరీరాన్ని ఎందుకు బాధపెట్టుకోవడం..ఈ వేలంటైన్స్ డే రోజు మిమ్మల్ని ప్రేమించడానికి ఓ వ్యక్తి లేరని బాధపడే బదులు మీకు మీరే వేలంటైన్‌గా మారిపోండి.. ఎప్పటినుంచో మీరు కొనాలనుకుంటున్న వస్తువును కొని ఈ వేలంటైన్స్ డేకి మీకు మీరే కానుకగా ఇచ్చుకోండి. అలాగే వేలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన వంటకాలు తయారుచేసి లేదా ఆర్డర్ చేసుకొని హ్యాపీగా లాగించేయండి.. ఈ రోజంతా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ట్రీట్ చేయండి. మీలోని మంచి గుణాలన్నింటినీ ఒక చోట రాసి మీకు మీరే చదివి వినిపించుకోండి. దీనివల్ల మీ విలువేంటో మీకూ అర్థమవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

స్నేహితులతో గడపండి..

ఒకవేళ ఒంటరిగా సమయం గడపడం మీకు ఇష్టం లేకపోతే మీ స్నేహితులతో కలిసి వేలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీకు బాగా క్లోజ్ అయిన ఒకరిద్దరు స్నేహితులతో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోండి. లేదా మీ ఇంట్లోనే అందరూ కలిసి పార్టీ చేసుకోండి. దీనివల్ల ఈ రోజును కాస్త కొత్తగా గడిపొచ్చు.

కొత్తగా ప్రయత్నించండి..

ఎప్పుడూ చేయని కొత్త పనులను ఈరోజు ప్రయత్నించి చూడండి. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నా.. ధైర్యం లేక, లేదా సమయం చాలక వాయిదా వేస్తున్న పనులను ఈరోజు ప్రయత్నించండి. జుట్టుకు కొత్త కలర్ వేసుకొని ప్రయత్నించడం, కొత్త ట్యాటూ వేసుకోవడం, ట్రెక్కింగ్ చేయడం వంటివి ట్రై చేయండి.. ఏదైనా సరే మొదటిసారి చేసిన రోజు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజును కూడా మర్చిపోలేనిదిగా మనం మార్చుకోవచ్చు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news