ఆఫ్ఘన్ లో తాలిబన్లకు విజయం… లొంగిపోయిన ఐసిస్ ఉగ్రవాదులు

-

ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్లకు సమస్యలు ఎదురవుతున్నాయి. పాలన అంత ఈజీ కాదనే విషయం త్వరలోనే అర్థమైంది. ఓ వైపు తిక్క తిక్క నిర్ణయాలతో ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలు కేవలం ఇళ్లకే పరిమితం అయ్యారు. మరోవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికి చైనా, పాకిస్తాన్ దేశాలు తప్పితే మరే దేశం తాలిబన్లను అధికారికంగా గుర్తించలేదు. మరోవైపు ఐసిస్ – కే ఉగ్రవాదులు తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. గతంలో ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంపై దాడి చేశారు. ఇటీవల ఉత్తర కుందుజ్ ప్రాంతంలో షియా మసీదుపై  ఆత్మాహుతి దాడితో వంద మందిని పొట్టన పెట్టుకున్నారు. కాందహార్, నంగన్ హార్ ప్రావిన్స్ ల్లో పలు దాడులు చేశారు.

కాగా.. ఇలాంటి పరిస్థితుల మధ్య తాలిబన్లకు విజయం లభించింది. దాదాపు 55 మంది ఐసిస్ ఉగ్రవాదులు తాలిబన్ల ఎదుట లొంగిపోయారు. వరసగా ఎదురు దెబ్బలు తింటున్న తాలిబన్లకు ఇది ఊరట కలిగించే అంశం. గత వారం 65 మంది దాకా ఉగ్రవాదులు తాలిబన్ల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నంగన్ హార్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news