స్టార్ హీరోయిన్ తమన్నా తాజాగా తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. హీరోయిన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకున్నానని అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తెలిపింది.టాలీవుడ్, బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా. దాదాపు 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్న ఇప్పటికి అవకాశాలు అందుకొచ్చుకుంటూ ముందుకు వెళుతుంది ఈ భామ. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్నతనం నుంచి తాను నటిని కావాలనుకున్నానని..
ఈ విషయంలో తన తల్లిదండ్రులు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారని చెప్పుకొచ్చిన తమన్నా.. బయట సమాజం నుంచి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తెలిపారు.. తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నేను స్కూల్‌లో ఉన్నపుడు ‘నువ్వు ఏం కావాలనుకుంటున్నావ్?’ అని అడిగారు. వెంటనే యాక్టర్ అని చెప్పేశా. అప్పటి నుంచి స్కూల్‌లో అందరూ నాతో అదోలా ప్రవర్తించేవారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తూ చిన్న చూపు చూసేవారు. నాతో స్నేహం చేయడానికి కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. అయితే ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు. చదువుకుంటూ కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. 13 ఏళ్లకే నటిని అయినప్పటికీ ఏ రోజు ఇబ్బంది పడలేదు. అయితే ఒకసారి బోర్డు ఎగ్జామ్స్ సమయంలో కమర్షియల్ యాడ్ లో నటించాల్సి వచ్చిన సమయంలో మాత్రం కాస్త ఇబ్బంది ఫీలయ్యా అంటూ తెలిపారు తమన్నా..