ఇటీవల రజనీకాంత్ ‘జైలర్’ సినిమా నుంచి ‘కావాలయ్యా..’ అనే సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటతో తమన్నా మరోసారి ట్రెండింగ్‌గా మారింది. రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్’ సినిమాను రూపొందించాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఒక ‘జైలర్’ జీవితంలో చోటుచేసుకునే సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉండనుంది. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచుతూ వెళుతున్నారు. అందులో భాగంగా రీసెంటుగా, ‘రా నువ్వు కావాలయ్యా’ అనే ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. ఇది తమన్నా బృందంపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్. ఈ పాటలో రజనీకాంత్ అక్కడక్కడా మెరుస్తాడు అంతే. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.
ఆయన కంపోజ్ చేసిన ‘ఫ్లూట్’ స్టెప్ బాగా పాప్యులర్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ స్టెప్ నే రీల్స్ గా చేస్తున్నారు. ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండింగులో దూసుకుపోతోంది. ఇప్పటికే 2 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. వివిధ భాషలకి చెందిన సీనియర్ స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.