viral video: స్కూల్ బస్సుల్లోనే బీరు కొడుతున్న విద్యార్థినిలు… తమిళనాడులో ఘటన

-

తమిళనాడులో ఓ స్కూల్ గర్ల్స్ కు సంబంధించిన ఓ వీడియో చాలా వైరల్ అవుతోంది. ఏదో ఘనత సాధించినందుకు ఈ వీడియో వైరల్ కాలేదు… స్కూల్ బస్సులోనే బీరు తాగుతూ..ఘనకార్యం వలకబోసినందుకు ఈ వీడియో తెగవైరల్ అవుతోంది. తమిళనాడు చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఓ స్కూల్ లో చదువుతున్న విద్యార్థినిలు… స్కూల్ బస్సులో యూనిఫామ్ తో ఉన్న అమ్మాయిలు ఒకరి తరువాత ఒకరు బీరు కొట్టారు. ఈ సంఘటనను వీడియో తీసిన మరో విద్యార్థి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయింది. జిల్లా అధికారులు పోలీసులు  ఈ వీడియోను పరిశీలిస్తున్నారు. మంగళవారం చెంగల్పట్టు జిల్లా తిరుకఘకుండ్రం నుంచి ఠాచూర్ వెళ్తుండగా.. ఈ ఘటన జరిగిందని పోలీస్ అధికారులు తెలిపారు. దారిలోనే బస్సులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు బీర్ బాటిల్స్ తెరిచి తాగడం ప్రారంభించారు. ఈ ఘటనను చెంగల్పట్టు జిల్లా విద్యాధికారి రోజ్ నిర్మల కూడా ధ్రువీకరించారు. ఇది పాఠశాల వెలుపల జరగడంతో.. దీనిపై పోలీసులు విచారణ జరుపుతారని.. అది ముగిసిన తర్వాత విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news