ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అకౌంట్లు నాకు తెలుసు : తమ్మారెడ్డి

-

ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తీసి ముఖాన కొడతామంటూ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొనగా… దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మెగాబ్రదర్ నాగబాబు తీవ్రంగా దానిని ఖండించడం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో,తమ్మారెడ్డి భరద్వాజ్ రాఘవేంద్రరావు, నాగబాబు వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అకౌంట్లు నాకు తెలుసు. అవార్డుల కోసం ఎవడి కాలు ఎవడు పట్టుకున్నాడో తెలుసు. పదవుల కోసం ఎవడు ఎవడ్ని అడుక్కున్నాడో తెలుసు. ఆర్ఆర్ఆర్ ఎంతో గొప్ప చిత్రం అని చెప్పాను, అప్పుడెవడూ పట్టించుకోలేదు. ఓ చిన్న క్లిప్పింగ్ పై మాత్రం కావాలని ఇంత గొడవ చేస్తున్నారు అని అన్నారు.

నేను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయటపడతాయి: తమ్మారెడ్డి

అవి అన్ని మాటవరసగా చేసిన వ్యాఖ్యలు అని తెలిపారు తమ్మారెడ్డి. ఏ సందర్భంలో అన్నానో, ఎక్కడ అన్నానో చూసుకోకుండా, నీకు అకౌంట్స్ తెలుసా అని ఒకడు అడుగుతాడు. ఇంకొకడు నీ అమ్మ మొగుడు అంటాడు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు… నీతినిజాయతీ నేర్పించాడు. అందుకే సహనం పాటిస్తున్నాను. నేను కూడా బూతులు మాట్లాడగలను. చిత్ర పరిశ్రమ నాకు తల్లి వంటిది. మీకు సిగ్గులేకపోతే నాకుంది. మిమ్మల్ని ఏమైనా అంటే చిత్రపరిశ్రమను విమర్శించినట్టవుతుంది… అందుకే మాట్లాడడంలేదు” అంటూ తమ్మారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news