అహ్మదాబాద్ టెస్టులో భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా

-

టీం ఆస్ట్రేలియా అహ్మదాబాద్ టెస్టులో భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180) భారీ సెంచరీ, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (114) మరో సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేసి భారీ స్కోరు నిలుపుకుంది. చివర్లో ఆస్ట్రేలియా టెయిలెండర్లు టాడ్ మర్ఫీ 41, నాథన్ లైయన్ 34 పరుగులు చేసి భారత బౌలర్లను గడగడలాడించారు. వీరిద్దరినీ అశ్విన్ అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కు ఒక ఫుల్స్టాప్ పడడం జరిగింది.

IND vs AUS: Australia towards a huge score.. Indian bowlers utter flop..  Khawaja, Green who showed their power with centuries.. | IND VS AUS 4th Test  Score update Australian Usman Khawaja and

ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ 6 వికెట్లు తీయడం టీం ఇండియాకు ఎంతో సహాయకరంగా నిలిచింది. షమీ 2, జడేజా 1 మరియు అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. అలెక్స్ క్యారీ డకౌట్ కాగా, స్టార్క్ 6 పరుగులకు పెవిలియన్ బాట పట్టాడు. ఆసీస్ లో-ఆర్డర్ మొత్తం అశ్విన్ ఖాతాలోకే చేరింది. ఇది ఆస్ట్రేలియన్ టీం కు ఒక పెద్ద నష్టం అని చెప్పుకోవొచ్చు. దీని అనంతరం, రెండో రోజు ఆట చివరి సెషన్ లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 10, కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news