నాకు నా కుటుంబనికి ప్రాణ భయం ఉంది – తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్

-

నాకు నా కుటుంబనికి ప్రాణ భయం ఉందని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ నిన్న మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

నాకు నా కుటుంబనికి ప్రాణ భయం ఉందన్నారు. గత కొన్ని రోజుల నుంచి మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి భయబ్రాంతులకు గురిచేసి బెదిరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మాపై ఎటువంటి దాడి జరిగిన దానికి పోలీసులు పూర్తి బాధ్యులని వివరించారు. మాపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని అనుకుంటున్నారన్నారు. జరుగుతున్న ఘటనలపై హోంమంత్రికి, డిజిపి కి ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్.

Read more RELATED
Recommended to you

Latest news