నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం… 22 మంది దుర్మరణం..!

-

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. తారా ఎయిర్ కు చెందిన విమానం పోఖరా నుంచి జామ్సన్ కు వెళ్తున్న క్రమంలో ఆదివారం ఉదయం 9.55 నిమిషాలకు గ్రౌండ్ స్టేషన్,  ఏటీసీతో సంబంధాన్ని కోల్పోయింది. దీంతో అప్రమత్తం అయిన నేపాల్ అధికారులు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విమానంలో 19 ప్రయాణికులు సిబ్బందితో కలిపి మొత్తం 22 మంది ఉన్నారు. హిమాాలయాల్లో ఎత్తైన పర్వత శిఖరాల్లో రెండు ప్రైవేటు హెలికాప్టర్లు, ఒక ఆర్మీ హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం వేళ విమానంలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ దేశానికి చెందిన వారు కాగా.. మిగతావారంతా నేపాల్ వాసులు.

అయితే తాజాగా విమాన కూలిపోయినట్లు తెలుస్తోంది. మస్తాంగ్ జిల్లా కవాంగ్ ప్రాంతంలో విమాన శఖలాలను గుర్తించారు. స్థానికులు, ఆర్మీ అధికారుల ప్రకారం విమానం హిమాలయాల్లోని లాంచే నదికి సమీపంలో క్రాష్ అయినట్లు గుర్తించారు. ఆర్మీ అధికారులు సంఘటన స్థలానికి భూమి, ఆకాశ మార్గాన చేరుకుంటున్నారు. అయితే దాదాపుగా 22 మంది మరణించే అవకాశమే ఉందని తెలుస్తోంది. కొండలను గుద్దుకోవడంతో ప్రమాదం ఏర్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అధికారులు మరణాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version