ఎన్నికల బరిలో తారకరత్న..టీడీపీ కోసం ఎన్టీఆర్..!

-

2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్…రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ప్రచారం చేశారు..యాక్సిడెంట్ అయినా సరే హాస్పిటల్ బెడ్ మీద నుంచి పార్టీ కోసం ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ రాజకీయాలకు దూరమయ్యారు. మళ్ళీ టీడీపీ వైపు రాలేదు. ఇటు చంద్రబాబు సైతం ఎన్టీఆర్‌ని దూరం పెట్టారనే టాక్ కూడా వచ్చింది. అప్పుడప్పుడు పార్టీల కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే జూనియర్ స్పందించారు..అంతే తప్ప రాజకీయంగా ఆయన దూరంగానే ఉన్నారు.

ఇక ఆయన సన్నిహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో జూనియర్ పరోక్షంగా చంద్రబాబుని దెబ్బకొట్టడం కోసం జగన్‌కు మద్ధతు ఇస్తున్నారనే విమర్శలు వచ్చాయి. కానీ ఏదేమైనా గాని మెజారిటీ ఎన్టీఆర్ అభిమానులు జగన్ వైపే ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక..పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. కానీ బాబు ఎలాగోలా మళ్ళీ పార్టీని గాడిలో పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు వినిపించడం లేదు.

కానీ అప్పుడప్పుడు కొడాలి నాని, వంశీలు మాత్రం ఎన్టీఆర్ పేరు తీస్తున్నారు. బాబు కావాలని ఎన్టీఆర్‌ని తోక్కేస్తున్నారని మాట్లాడుతూ…ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు వైసీపీకి పడేలా చేయడానికి చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్ధతుగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని నందమూరి తారకరత్న అన్నారు. ప్రస్తుతం టీడీపీ కోసం తిరుగుతున్న తారకరత్న..వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తన తమ్ముడు ఎన్టీఆర్ కూడా ప్రచారానికి వస్తారని చెప్పారు.

అయితే తారకరత్న పోటీకి రెడీ అయ్యారు..కానీ సీటు ఏది అనేది క్లారిటీ లేదు. చంద్రబాబు ఏమైనా హామీ ఇచ్చారా? ఏ సీటు ఇస్తారనేది తెలియదు. అలాగే జూనియర్ ఎన్నికల ప్రచారానికి వస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి టీడీపీలో మళ్ళీ ఎన్టీఆర్ హాట్ టాపిక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news