ఈడీకు రోహిత్ రెడ్డి ట్విస్ట్..కేసీఆర్‌ని కలిసి..గడువు..!

-

తెలంగాణలో బీఆర్ఎస్ నేతల టార్గెట్ గా ఈడీ, ఐటీ, సి‌బి‌ఐ నోటీసులు పంపడం..రైడ్స్ , విచారణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐటీ ఎగవేత, పలు వ్యాపార లావాదేవీల్లో అక్రమాలు, డ్రగ్స్ కేసులు, లిక్కర్ స్కామ్‌ ఇలా పలు అంశాలకు సంబంధించి.. రైడ్స్ నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పక్కాగా ఆడియో, వీడియోలు వదిలిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఇటీవల ఈడీ నోటీసులు పంపింది. 19వ తేదీన విచారణకు రావాలని కోరారు.

అయితే 19వ తేదీ వచ్చింది గాని రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు..పైగా ప్రగతి భవన్‌కు వెళ్ళి కేసీఆర్‌ని కలిశారు.  తర్వాత ఈ రోజు విచారణకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. వారం రోజులు గడువు కావాలంటూ న్యాయవాదితో ఈడీకి లేఖ పంపారు. వాస్తవానికి ఈడీ విచారణకు ఎమ్మెల్యే ఇంటి నుంచి బయలుదేరారు. రాహుకాలం ముగిసినందున ఈడీ కార్యాలయానికి బయలుదేరినట్లు చెప్పారు. ఆ తర్వాత ఫోన్ రావడంతో ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత పరిణామాలు మారిపోయాయి. సీఎం సూచనలతో నేడు ఈడీ విచారణకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.

తనకు చాలా తక్కువ సమయం కేటాయించారని, మరో వారం రోజులు గడువు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. వరుస సెలవుల కారణంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌… ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేక పోయానని అన్నారు. మరి ఈడీ రోహిత్ రెడ్డి లేఖపై ఎలా స్పందిస్తుంది..మరో గడువు ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈయన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా ఉండటంతో బీజేపీ టార్గెట్ చేసి..ఈడీ చేత ఇలా ఇబ్బందులు పెట్టిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక తప్పు చేసిన వారు ఎవరైనా చట్టానికి అతీతులు కాదని బీజేపీ అంటుంది. ఇక విచారణకు హాజరు కాకుండా రోహిత్, కేసీఆర్‌ని కలిసి ఆ తర్వాత విచారణకు ఇప్పుడు హాజరు కాలేనని, మరి కొంత సమయం ఇవ్వాలని గడువు కోరడం వెనుక ఉన్న మతలబు ఎంతో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news