బ్రౌన్ రైస్ తో మనం ఎన్నో రుచికరమైన రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం బ్రౌన్ రైస్ సలాడ్ Brown rice salad ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేది చూద్దాం.
ప్రిపరేషన్ సమయం: నలభై నిముషాలు
సర్వింగ్స్: ఆరు
మొత్తం క్యాలరీలు: 448.8
బ్రౌన్ రైస్ సలాడ్ కి కావలసిన పదార్థాలు:
ఒకటిన్నర కప్పులు బ్రౌన్ రైస్
తరిగిన క్యాప్సికం 1
ఉల్లికాడలు తరిగినవి 3
అర కప్పు జీడిపప్పు లేదా పల్లీలు
అర కప్పు ఆలివ్ ఆయిల్
రెండు టేబుల్ స్పూన్లు సోయాసాస్
ఒక వెల్లుల్లిరెమ్మ
నల్ల మిరియాలు
సాల్ట్ రుచికి సరిపడా
బ్రౌన్ రైస్ సలాడ్ తయారు చేసుకునే పద్ధతి:
ముందుగా ఒకటిన్నర కప్పులు బ్రౌన్ రైస్ తీసుకుని ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకుని ఆలివ్ ఆయిల్, సోయా సాస్, వెల్లుల్లి ముక్కలు చేసినవి, మిరియాలు వేసి ఒకసారి షేక్ చేయాలి.
ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో అన్నం వేసి వేయించుకున్న ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ ని వేసేయాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమంలో తరిగిన క్యాప్సికం ముక్కల్ని, తరిగిన ఉల్లికాడలని, అర కప్పు జీడిపప్పు లేదా పల్లీలుని, రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసే దాకా పై నుండి కింద వరకు మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే.
తక్కువ సమయంలోనే బ్రౌన్ రైస్ తో పెరుగన్నం ఇలా తయారు చేసుకోండి..!
ఎంతో రుచికరమైన క్రిస్పీ బ్రౌన్ రైస్ దోస రెసిపీ మీకోసం..!
డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవచ్చా ?